శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
AP TODAY
AP TODAY

October 22, 2026

వైసీపీ నేత దువ్వి మహేష్‌తో పాటు జనసేనలో చేరిన నాయకులు, కార్యకర్తలు

మధురవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జీవీఎంసీ 7వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ నేత దువ్వి మహేష్‌తో పాటు సుమారు 200 మంది జనసేన పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

వార్డు అధ్యక్షుడు దేవర శివ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సందీప్ పంచకర్ల సమక్షంలో నాయకులు, కార్యకర్తలు జనసేన కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని జనసేన నాయకులు సాదరంగా ఆహ్వానించారు.

కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు: సందీప్ పంచకర్ల

ఈ సందర్భంగా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జనసేన పార్టీలో జరగనున్నాయని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

పార్టీపై నమ్మకంతో జనసేనలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్త కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement