మధురవాడ: జీవీఎంసీ ఎనిమిదో వార్డులో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్ల అనిత హామీ ఇచ్చారు. వార్డు ప్రజలు తనను ఆదరించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఎనిమిదో వార్డులో తాగునీటి సరఫరా, వీధి దీపాలు, కాలువల నిర్వహణ వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పిల్ల అనిత పేర్కొన్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలందించడమే తన లక్ష్యమని వెల్లడించారు.
పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులకు ఇబ్బందులు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు విమర్శలు
పిల్ల అనిత భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు. పెరుగుతున్న ధరల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు లభించేవని పేర్కొన్నారు.
ఎనిమిదో వార్డు ప్రజలు తమకు మద్దతుగా నిలిచి పిల్ల అనితను కార్పొరేటర్‌గా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు వార్డు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిల్ల సూరిబాబు, జగ్గు, పిల్లి నరేష్, లక్ష్మణ్, రాము తదితరులతో పాటు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డులో ప్రజలను కలిసి పిల్ల అనితకు మద్దతు ఇవ్వాలని కోరారు.