మధురవాడ: జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పిళ్ళా అనిత ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. “ఉండమ్మా బొట్టు పెడతా..” అంటూ మహిళా ఓటర్లకు స్వయంగా కుంకుమ బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించడం మధురవాడలో చర్చనీయాంశంగా మారింది.
నగరంపాలెం, మల్లయ్యపాలెంలో ఇంటింటా ప్రచారం
గురువారం నగరంపాలెం, మల్లయ్యపాలెం పరిసర ప్రాంతాల్లో పిళ్ళా అనిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ, కుంకుమ బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా తనతో పాటు మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారానికి హామీ
ప్రచారంలో భాగంగా పిళ్ళా అనిత మాట్లాడుతూ, 8వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు, రహదారుల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
పిళ్ళా అనిత చేపట్టిన వినూత్న ప్రచార కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జులు, మహిళా విభాగం నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.