దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మ–వైభవ్ ఫన్నీ ఫైట్.. వీడియో వైరల్
తొలి రోజు వైభవ్‌ను తిలక్ వర్మ టీజ్.. నాలుగో రోజు తిలక్‌ను ఆటపట్టించిన ‘బేబీ బాస్’
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సౌత్ జోన్ ఆటగాడు తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ తొలి రోజు ఆటలో వైభవ్ సూర్యవంశీని తిలక్ వర్మ సరదాగా టీజ్ చేశారు. అయితే నాలుగో రోజు ఆటలో సీన్ రివర్స్ అయింది. వైభవ్ సూర్యవంశీ తిలక్ వర్మను ఆటపట్టించారు.
ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ భుజం తనకు తగలడంతో తిలక్ వర్మ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వైభవ్ సరదాగా స్పందిస్తూ.. “ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాకు కూడా ఇలాగే జరిగింది” అంటూ తిలక్‌కు సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న ఆటగాళ్ల మధ్య నవ్వులు పూశాయి.
మైదానంలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆటగాళ్ల మధ్య సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.