ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్సీకి ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనను ఉద్దేశించి ‘బ్రదర్.. దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావ్?’ అంటూ పలుమార్లు బిగ్గరగా ప్రశ్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న అభిజీత్ దీప్సీని సదరు వ్యక్తి పదేపదే ప్రశ్నించగా.. ఆయన మాత్రం స్పందించకుండా థంబ్స్-అప్ సింబల్ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో దీప్సీ ఎలాంటి వాగ్వాదానికి దిగకుండా మౌనంగా వెళ్లిపోవడం గమనార్హం.
కాగా, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా అరెస్టైన సౌరవ్ దాస్, రాంకాను కలిసేందుకు అభిజీత్ దీప్సీ ముంబై నుంచి ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు విమానాశ్రయం వద్ద ఈ అనుభవం ఎదురైంది.