శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో విశేష కుంకుమ పూజలు
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో విశేష కుంకుమ పూజలు
AP TODAY
AP TODAY

September 25, 2026

300 మంది భక్తులకు అన్నసంతర్పణ.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

మధురవాడ, సెప్టెంబర్ 25: చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ షిర్డీ సాయినాథుని సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి.

ఉదయం నిత్యార్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం దుర్గాలమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన తదితర పూజలను ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ తదితరులు నిర్వహించారు. పూజల అనంతరం కర్పూర హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

సాయంత్రం ప్రత్యేక అభిషేకం

సాయంత్రం అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. కర్పూర హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దీపారాధన కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

300 మంది భక్తులకు అన్నసంతర్పణ

ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. వెల్లంకి వాస్తవ్యులు, పీఎం పాలెం నివాసి శ్రీ సతీష్, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో సుమారు 300 మంది భక్తులు, పేదలకు అన్నప్రసాదం అందించారు.

అదేవిధంగా చంద్రంపాలెం వాస్తవ్యులు వరదా సత్యారావు (లేటు), శ్రీమతి శాంతమ్మ దంపతుల కుమారులు రవి దంపతులు అందించిన ఆర్థిక సహకారంతో పులిహోర ప్రసాదాన్ని తయారు చేసి ముందుగా అమ్మవారికి నివేదించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఆలయ కమిటీ సభ్యుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పిళ్లా పోతరాజు, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము, పిళ్లా వెంకట్ (చిన్నీ), సోషల్ మీడియా ఇన్‌చార్జి మరుపిల్లి ఆనంద్ పాల్గొన్నారు.

చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, బి. సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు దుర్గాశి సోంబాబు, పొట్నూరి హరికృష్ణ, వాండ్రాసి అప్పారావు, దుర్గాశి మణికంఠ, పిళ్లా రమణ, కేశనకుర్తి అప్పారావు, సుందర శ్రీను, పిళ్లా సురేష్, పిళ్లా గోకుల్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య సభ్యులు శంకాబత్తుల శ్రీను, పిళ్లా వెంకటరమణ, పోతిన అచ్చియ్యపాత్రుడు, పిళ్లా అప్పన్న, నాగోతి అప్పారావు, పొట్నూరి వాసు, నాగోతి అప్పలరాజు, గరె రామారావు, పోతిన రాంబాబు, ఆలయ సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement