శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / చంద్రంపాలెం జాతరగట్టుపై శ్రీ మహాలక్ష్మి దేవిగా దుర్గాలమ్మ దర్శనం
చంద్రంపాలెం జాతరగట్టుపై శ్రీ మహాలక్ష్మి దేవిగా దుర్గాలమ్మ దర్శనం
AP TODAY
AP TODAY

October 17, 2026

విశాఖపట్నం:

విశాఖపట్నం జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారికి పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల మూర్తి శర్మల బృందం ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, పసుపు కొమ్ముల పూజ, సూర్య నమస్కారాలు, హోమం, నీరాజనం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చంద్రంపాలెంకు చెందిన పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, అనిత దంపతుల సహకారంతో క్షీరాన్నం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, కమిటీ అధ్యక్షుడు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షుడు పిళ్లా పోతరాజు, జనరల్ సెక్రటరీ నాగోతి తాతారావు, సెక్రటరీ పోతిన పైడిరాజు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి పిళ్లా వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ పోతిన ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి హరికృష్ణ, మీడియా ఇన్‌చార్జి బోగవిల్లి రాము, సోషల్ మీడియా ఇన్‌చార్జి మరుపిల్లి ఆనంద్, కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement