శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ కుట్ర.. పైలట్‌పై గొడ్డలితో దాడి.. మరణశిక్ష కోరిన యూఏఈ
విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ కుట్ర.. పైలట్‌పై గొడ్డలితో దాడి.. మరణశిక్ష కోరిన యూఏఈ
AP TODAY
AP TODAY

October 5, 2026

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటన కలకలం రేపుతోంది. విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దాడిలో పైలట్ తీవ్రంగా గాయపడినప్పటికీ, పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొని కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటనపై యూఏఈ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 29 ఏళ్ల ఒమన్ జాతీయుడైన అల్-హమ్మామీని సౌదీ అరేబియాలో అదుపులోకి తీసుకున్న అనంతరం యూఏఈకి తరలించారు. విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు విచారణలో అతను అంగీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ ఘటనను యూఏఈ అధికారులు అత్యంత తీవ్రమైన ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నట్లు సమాచారం. విమాన ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన నిందితుడికి అత్యంత కఠినమైన శిక్షగా మరణశిక్ష విధించాలని యూఏఈ ప్రాసిక్యూటర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement