ఆదివారం, 01 నవంబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / జై భారత్‌ నగర్‌లో పార్కు ఏర్పాటు చేయాలి.. కలెక్టర్‌కు చిన్నారులతో కలిసి స్థానికుల ఫిర్యాదు
జై భారత్‌ నగర్‌లో పార్కు ఏర్పాటు చేయాలి.. కలెక్టర్‌కు చిన్నారులతో కలిసి స్థానికుల ఫిర్యాదు
AP TODAY
AP TODAY

October 12, 2026

37వ వార్డులో పిల్లలకు ఆటస్థలం, వృద్ధులకు పార్కు కల్పించాలని విజ్ఞప్తి

విశాఖపట్నం: విశాఖపట్నంలోని జీఎంసీ 37వ వార్డు పరిధిలో ఉన్న జై భారత్‌ నగర్‌లో చిన్నారులకు ఆటస్థలం, స్థానికులకు పార్కు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమంలో చిన్నారులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

పిల్లలకు ఆటస్థలం.. వృద్ధులకు పార్కు కరువు

జై భారత్‌ నగర్‌లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి తగిన స్థలం లేదని స్థానికులు తెలిపారు. అదేవిధంగా వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో సేదతీరేందుకు పార్కు కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ ప్రాంతంలో పిల్లలు, వృద్ధుల అవసరాలకు అనుగుణంగా పార్కు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలు ఆడుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వృద్ధులు నడక, విశ్రాంతి కోసం అనువైన ప్రదేశం లేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు వివరించారు.

ప్రజాప్రతినిధులను కలిసినా పరిష్కారం కాలేదని ఆవేదన

తమ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేయాలని గతంలో ప్రజాప్రతినిధులను కూడా కలిసి విజ్ఞప్తి చేసినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, శారీరక వికాసం, వృద్ధుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని జై భారత్‌ నగర్‌లో పార్కు, ఆటస్థలం ఏర్పాటు చేయాలని కోరారు.

కలెక్టర్‌ సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి

జిల్లా కలెక్టర్‌ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో పరిశీలన చేయించి పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రాంతవాసులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే వాతావరణం కల్పించడంతో పాటు, వృద్ధులకు ఆహ్లాదకరమైన ప్రదేశం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement