శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / భక్తులకు గుడ్ న్యూస్.. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ATM ప్రారంభం
భక్తులకు గుడ్ న్యూస్.. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో లడ్డూ ATM ప్రారంభం
AP TODAY
AP TODAY

September 24, 2026

విజయవాడ, సెప్టెంబర్ 24: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం ATMను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

కొండ దిగువన అర్జునవీధి ప్రారంభంలో ఉన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

భక్తులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపు చేసి క్యూలో ఎక్కువసేపు వేచి ఉండకుండా లడ్డూ ప్రసాదాన్ని పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ సేవను ప్రారంభించామని, పనితీరును పరిశీలించిన అనంతరం భక్తుల రద్దీ అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, తాగునీరు, భద్రత, ప్రసాద పంపిణీ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు, కౌంటర్ల ద్వారానే ఆలయ సేవలు, పూజా టికెట్లు పొందాలని అధికారులు భక్తులకు సూచించారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement