శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
AP TODAY
AP TODAY

October 14, 2026

పాడేరు, అక్టోబర్ 14: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన యువతను ఉన్నత ప్రభుత్వ సేవల్లోకి ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖపట్నంలోని వేపగుంట YTCలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఐఏఎస్ బుధవారం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం 11 నెలల పాటు కొనసాగనుంది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం అవసరమని అభ్యర్థులకు సూచించారు. కోచింగ్‌తో పాటు స్వీయ అధ్యయనం, క్రమం తప్పకుండా పునశ్చరణ, నమూనా పరీక్షల విశ్లేషణపై దృష్టి పెట్టాలని తెలిపారు.

పోటీ పరీక్షల్లో ఎదురయ్యే అపజయాలకు నిరుత్సాహపడకుండా, తప్పులను సరిదిద్దుకుంటూ లక్ష్యం వైపు ముందుకు సాగాలని అన్నారు. గిరిజన నేపథ్యం ఉన్నత లక్ష్యాల సాధనకు అడ్డంకి కాకూడదని, అందుబాటులో ఉన్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పాడేరు ప్రాజెక్టు అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement