AP:రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్, డీఈఓ, ఆర్టీవో, మున్సిపల్ కమిషనర్ తదితర కీలక పోస్టులు ఉన్నాయి.
గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 27 వరకు కొనసాగనుంది. అర్హత, వయసు, ఫీజు తదితర నిబంధనలను నోటిఫికేషన్‌లో అభ్యర్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసే సర్వీసులు ఇవే..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లోని కీలక సర్వీసుల పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
-
డిప్యూటీ కలెక్టర్: 11 పోస్టులు
-
ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్: 14 పోస్టులు
-
డీఎస్పీ (సివిల్): 36 పోస్టులు
-
డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 3 పోస్టులు
-
డీఈఓ: 14 పోస్టులు
-
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 1 పోస్టు
-
ఆర్టీవో: 3 పోస్టులు
-
డిప్యూటీ రిజిస్ట్రార్ (కోఆపరేటివ్ సర్వీసెస్): 15 పోస్టులు
-
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2: 12 పోస్టులు
-
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్: 2 పోస్టులు
-
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 3 పోస్టులు
-
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 14 పోస్టులు
-
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 35 పోస్టులు
దరఖాస్తు ఎలా చేయాలి?
గ్రూప్-1 ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
APPSC Group-1 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం:
APPSC అధికారిక పోర్టల్
ముఖ్యమైన తేదీలు:
-
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 6 అక్టోబర్ 2026
-
దరఖాస్తుల చివరి తేదీ: 27 అక్టోబర్ 2026
-
మొత్తం ఖాళీలు: 163