మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
AP TODAY
AP TODAY

6 hours ago

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ **‘ది ప్యారడైజ్‌’**పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్‌ ఓదెల కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు సంబంధించి హీరో నాని కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు ట్రైలర్‌ విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ.. ప్రేక్షకులకు అత్యుత్తమ క్వాలిటీ అవుట్‌పుట్‌ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రిలీజ్‌కు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రైలర్‌ కోసం ప్రత్యేకంగా నాలుగైదు రోజులు కేటాయిస్తే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని నాని వివరించారు. మంచి ట్రైలర్‌ ఇవ్వాలని తమకూ ఉందని, అయితే ట్రైలర్‌ కంటే సినిమా నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని టీమ్‌ నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

SLV సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తున్నారు. మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

‘ది ప్యారడైజ్‌’ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో సెప్టెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ట్రైలర్‌ లేకుండానే థియేటర్లలోకి వస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement