పుతిన్‌కు మోదీ స్పెషల్ గిఫ్ట్.. రష్యన్ భాషలో ‘తిరుక్కురళ్’!
బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతిని అందించారు. తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని పుతిన్‌కు మోదీ బహుమతిగా ఇచ్చారు.
తిరుక్కురళ్‌లో మొత్తం 1,330 ద్విపదలు ఉన్నాయి. నైతిక విలువలు, ధర్మం, పాలన, సంపద, మానవ సంబంధాలు, ప్రేమ వంటి అనేక అంశాలపై ఇందులో గొప్ప సందేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాహిత్య, తాత్విక గ్రంథంగా తిరుక్కురళ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
భారతీయ సాహిత్యం, సంస్కృతి, తాత్విక ఆలోచనలను రష్యా అధ్యక్షుడికి పరిచయం చేసే ఉద్దేశంతో మోదీ ఈ పుస్తకాన్ని అందించారు. భారత్-రష్యా మధ్య రాజకీయ, ఆర్థిక, రక్షణ సంబంధాలతో పాటు సాంస్కృతిక అనుబంధానికి కూడా ప్రాధాన్యం ఉందనే సందేశాన్ని ఈ ప్రత్యేక బహుమతి చాటుతోంది.