మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / సుందరం మాస్టారు ఆశీర్వాదం వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను... బండారు సత్యానందరావు
సుందరం మాస్టారు ఆశీర్వాదం వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను... బండారు సత్యానందరావు
AP TODAY
AP TODAY

September 5, 2026

ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం అద్వితీయమైనదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.భారత దేశ రెండవ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహోన్నత తత్వవేత్త, మహా మనిషి భారత దేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అటువంటి మహనీయుడు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఒక ఏడాది పాటు పని చేయడం మన గోదావరి తీర ప్రాంత వాసులందరికీ గర్వకారణమన్నారు.ఆయన తన జీవితకాలమంతా విజ్ఞాన వ్యాప్తికి కృషి చేశారని, వందకు పైగా పురస్కారాలు పొందారని కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ బాటలో నేటి ఉపాధ్యాయులు పయనించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు మాత్రమే తన శిష్యులందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. మరే వృత్తిలోనూ ఇది సాధ్యం కాదన్నారు. తన విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసే గొప్పతనం ఉపాధ్యాయులకు ఉంటుందన్నారు. తన గురువైన సుందరం మాస్టారు ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలంటే తెలియని వయసులోనే తనను నీవు ఎమ్మెల్యే అవ్వాలి అంటూ సుందరం మాస్టారు దీవించారని, ఆయన దీవెనలతో కొత్తపేట ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే కావడం జరిగిందన్నారు. గురువు ఆశీర్వాదం ఎంత గొప్పదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుందన్నారు. తనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులందరూ తనకు ఆరాధ్యులని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏ విధంగా నడవడిక నేర్చుకుంటారో, అదేవిధంగా గురువులను చూసి నడవడికను రూపొందించుకుంటారని, కనుక ఉపాధ్యాయులు ఎంత ఆదర్శంగా ఉంటే విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా ముందుకు వెళతారని తెలిపారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement