పుష్ప సినిమాతో దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. ఇండియాలో వివిధ రంగాలలో ప్రభవ వంతులైన 100 మంది సెలబ్రెటీస్ తో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా ''షోస్టాపర్స్ 2026'' స్పెషల్ ఎడిషన్ కవర్ పేజ్ పై అల్లు అర్జున్ ఫోటోను ముద్రించారు. ఫోర్బ్స్ ఇండియా ప్రతియేటా విదుదల చేసే ఈ జాబితాలో అల్లు అర్జున్ తో పాటు అమితాబచ్చన్, అక్షయ్ కుమార్, దుల్ఖర్ సల్మాన్, మోహన్ లాల్, రాంచరణ్, రజనీకాంత్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, ఎ.ఆర్.రెహమాన్ తదితరులకు స్థానం కల్పించారు. ఈ ఘనత పై అల్లు అర్జున్ మాట్లాడుతు "సినిమా విజయానికి కథ ప్రధానం , ఏ బాషా చిత్రానికీ అయినా అదే సూత్రం వర్తిస్తుంది. కంటెంట్ ఉంటే బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు.హీరో స్టార్ డమ్ కంటే కథలో కొత్తదనం ఉంటే సినిమా విజయం సాధిస్తుంది అని అన్నారు".