న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై ఓ పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రపతిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు ఓ భారతీయుడు ఇచ్చిన ఘాటైన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సదరు పాకిస్థానీ యూజర్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూపాన్ని ఉద్దేశించి అవమానకరంగా వ్యాఖ్యానిస్తూ.. ఆమె ముఖం చూడాలంటే ఫోన్ బ్రైట్నెస్‌ను 100 శాతానికి పెంచాల్సి వస్తుందేమోనని ట్వీట్
దీనికి ఓ భారతీయ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. “ఆమె మా దేశపు మొదటి పౌరురాలు. త్రివిధ దళాలకు సర్వోన్నతాధికారి. ఆమె ఆదేశిస్తే మీ దేశం మ్యాప్‌లో లేకుండా పోతుంది. 100 శాతం బ్రైట్నెస్ పెట్టినా కనిపించదు. కాబట్టి నోరు మూసుకుని ఉండు” అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఈ రిప్లైపై పలువురు భారతీయ నెటిజన్లు స్పందిస్తూ.. దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.