మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / స్నేహారెడ్డి ఫొటోలు వైరల్.. ‘ఏఏ ఎక్కడ?’ అంటూ అభిమానుల ఆసక్తికర ప్రశ్నలు!
స్నేహారెడ్డి ఫొటోలు వైరల్.. ‘ఏఏ ఎక్కడ?’ అంటూ అభిమానుల ఆసక్తికర ప్రశ్నలు!
AP TODAY
AP TODAY

August 25, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హతో పాటు కుటుంబానికి చెందిన పెంపుడు శునకాలతో గడిపిన మధుర క్షణాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

పచ్చని తోటలో అయాన్, అర్హతో కలిసి సంతోషంగా గడిపిన ఈ క్షణాలు ఫొటోల్లో ఎంతో అందంగా కనిపించాయి. వారితో పాటు రెండు పెంపుడు శునకాలు కూడా సందడి చేశాయి. తన పిల్లలే తన ప్రపంచమంటూ స్నేహారెడ్డి భావోద్వేగంగా పేర్కొన్నారు. వారి చిన్న చిన్న అడుగులు, అమాయకమైన నవ్వులు తన జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తాయని ఆమె తన పోస్ట్‌లో వెల్లడించారు.

అయితే ఈ ఫొటోలను చూసిన అభిమానులు మాత్రం వెంటనే అల్లు అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ‘ఏఏ ఎక్కడ?’, ‘అల్లు అర్జున్ ఎక్కడ?’, ‘అందమైన ఫ్యామిలీ.. కానీ బన్నీ మిస్సయ్యారు’ అంటూ సోషల్ మీడియాలో వరుస కామెంట్లు చేస్తున్నారు.

కాగా, అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఈ ఏడాది మార్చిలో తమ వివాహ బంధానికి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేకంగా వేడుక చేసుకున్నారు. ప్రేమ, కుటుంబం, పిల్లలు, మధుర జ్ఞాపకాలతో తమ జీవితం ఎంతో అందంగా సాగుతోందని స్నేహారెడ్డి అప్పట్లో పేర్కొన్నారు.

ఇప్పుడు పిల్లలు, పెంపుడు శునకాలతో కలిసి స్నేహారెడ్డి పంచుకున్న ఈ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఫొటోల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడమే అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement