మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / అప్పు కంటే ఎక్కువే రికవరీ చేశారు.. : విజయ్ మాల్యా ఆవేదన
అప్పు కంటే ఎక్కువే రికవరీ చేశారు.. : విజయ్ మాల్యా ఆవేదన
AP TODAY
AP TODAY

August 27, 2026

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణ బకాయిల వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి తనకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఉన్న అసలు అప్పు కంటే బ్యాంకులు, ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేశాయని ఆయన ఆరోపించారు.

సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో విజయ్ మాల్యా చేసిన తాజా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మీడియా అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార వార్తను ప్రస్తావిస్తూ, భారతదేశంలో రుణ పరిష్కార వ్యవస్థపై ఆయన ప్రశ్నలు సంధించారు.

ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద సుభాష్ చంద్ర రూ.6.5 కోట్లు చెల్లించి, రూ.22,006 కోట్ల రుణ క్లెయిమ్‌లను సెటిల్ చేసుకోబోతున్నారంటూ వచ్చిన మీడియా కథనాన్ని మాల్యా ప్రస్తావించారు. ఇది నిజమైతే సుభాష్ చంద్రకు అభినందనలు అని పేర్కొంటూ, తన నుంచి మాత్రం రూ.6,203 కోట్ల అప్పునకు గాను రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు ప్రభుత్వం, బ్యాంకులు అంగీకరించాయని ఆయన వ్యాఖ్యానించారు.

“ఇదే భారత రుణ పరిష్కార న్యాయమా?” అంటూ మాల్యా ప్రశ్నించారు. తన కేసులో జరిగిన రికవరీపై మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా నిలదీశారు.

గత ఏడాది డిసెంబర్‌లోనూ మాల్యా ఇదే అంశంపై ఆరోపణలు చేశారు. తన నుంచి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించి ప్రభుత్వం, బ్యాంకులు వెల్లడిస్తున్న లెక్కల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పగా, బ్యాంకులు మాత్రం రూ.10,000 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు చెబుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

రికవరీ లెక్కలపై స్పష్టత కోసం ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా మాల్యా గతంలో డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 అక్టోబర్ 31 నాటికి దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించారు. వీరి కారణంగా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మాల్యా నుంచి రుణాలపై గణనీయమైన మొత్తం రికవరీ అయినప్పటికీ, వడ్డీ, జరిమానాలు, అలాగే ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement