మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కోనసీమ జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి.. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
కోనసీమ జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి.. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
AP TODAY
AP TODAY

6 days ago

అమలాపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా అందజేయనున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 09:45 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న చంద్రబాబు, ఉదయం 10:30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి 10:55 గంటలకు మాచవరం గ్రామానికి వెళ్లి రైతులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.

మధ్యాహ్నం 01:55 గంటలకు పండువారిపేటలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గ్రామసభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.

అనంతరం సాయంత్రం 03:15 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలపై నేతలు, కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉంది.

కార్యక్రమాలన్నీ ముగించుకున్న అనంతరం సాయంత్రం 05:40 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement