మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కలెక్టర్లూ.. ఆలోచనా విధానం మార్చుకోండి: చంద్రబాబు కీలక సూచనలు
కలెక్టర్లూ.. ఆలోచనా విధానం మార్చుకోండి: చంద్రబాబు కీలక సూచనలు
AP TODAY
AP TODAY

5 days ago

అమరావతి: ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, న్యూ ఏజ్ లీడర్‌షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ విధానాలను అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ.. ప్రజలకు వేగంగా, కచ్చితమైన ఫలితాలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

అమరావతిలో గురువారం జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ‘లీడర్‌షిప్ – న్యూ ఏజ్ గవర్నెన్స్’ అంశంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నాయకత్వమే కీలకం

గతంలో పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై దృష్టి పెట్టామని, ప్రస్తుతం ప్రధానంగా నాయకత్వంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సరైన నాయకత్వంతోనే వేగంగా ఫలితాలు సాధించగలమని, తద్వారా స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు.

నాయకత్వం అనేది స్వీయ ప్రేరణతో రావాలని సూచించిన సీఎం.. నాయకత్వంలో మహిళలు, పురుషులు అనే భేదం చూడటం పాతకాలపు ఆలోచనా విధానమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ మార్పు దశ కొనసాగుతోందని, అధికారులు కూడా కొత్త తరహా నాయకత్వ పద్ధతులను అనుసరించాలని సూచించారు.

విశ్వసనీయతకు పెద్దపీట

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థలు కూడా వేగంగా మారుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, రాజకీయ నాయకులకు విశ్వసనీయత అత్యంత కీలకమని పేర్కొన్నారు.

వృత్తిపరంగా ముందుకు వెళ్లాలంటే నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకూడదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అధికారులు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని అన్నారు.

ఏఐతో వేగవంతమైన పరిపాలన

పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణ, అవేర్, డేటా లేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డేటాను విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తద్వారా పొరపాట్లకు అవకాశం తగ్గించి, ప్రజలకు మరింత కచ్చితమైన ఫలితాలను అందించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

భారతీయుల ప్రతిభను స్ఫూర్తిగా తీసుకోవాలి

ప్రపంచవ్యాప్తంగా భారతీయ పారిశ్రామికవేత్తలు అత్యుత్తమంగా రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏ వ్యవస్థలోనైనా ఇమిడిపోయి, పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే సామర్థ్యం భారతీయుల సొంతమని పేర్కొన్నారు.

అదే స్ఫూర్తితో అధికారులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సీఎం ఆకాంక్షించారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement