మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / తలుపుల పీహెచ్‌సీలో గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్స్ ట్రస్ట్ పౌష్టికాహారం
తలుపుల పీహెచ్‌సీలో గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్స్ ట్రస్ట్ పౌష్టికాహారం
AP TODAY
AP TODAY

5 days ago

గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్స్ ట్రస్ట్ పౌష్టికాహారం

తలుపుల పీహెచ్‌సీలో 100 మందికి పౌష్టికాహారం పంపిణీ

తలుపుల, సెప్టెంబర్ 10: తలుపుల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ ప్రతి నెలా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి తలుపుల ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర రాఘవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న సమయంలో పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమం ఎంతో గొప్పదని ప్రశంసించారు.

సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని వీర రాఘవ రెడ్డి అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

అనంతరం ముఖ్య అతిథి వీర రాఘవ రెడ్డికి ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ మన్సూర్ తరఫున దేవుని ప్రతిమ చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది కలిపి సుమారు 100 మందికి పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆశ్రిత, హోమియోపతి డాక్టర్ లక్ష్మీనరసయ్య, వైద్య సిబ్బంది, ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement