హిమాలయ పర్వతశ్రేణుల్లో భారీ హిమానీనదం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద మంచు, రాళ్లతో కూడిన పర్వత భాగం ఒక్కసారిగా విరిగిపడిన దృశ్యాలను డ్రోన్ కెమెరా రికార్డ్ చేసింది.
చైనాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ సుమారు 7,200 మీటర్ల ఎత్తు నుంచి ఈ విపత్తును చిత్రీకరించారు. భారీ మంచు ఫలకం, దాని కింద ఉన్న రాతి పొరలు ఒక్కసారిగా కూలిపడటం.. ఆ తర్వాత దట్టమైన ధూళి మేఘాలు పైకి లేవడం వీడియోలో కనిపిస్తోంది.
కూలిన పర్వత భాగం సుమారు 1,200 మీటర్ల దిగువన ఉన్న లోయలో పడటంతో మంచు, రాళ్లు, బురదతో కూడిన భారీ ఉప్పెన ఏర్పడింది.
ఈ ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఆగస్టు 26న భోటేకోశి, త్రిశూలి నదుల్లో తీవ్ర వరదలకు దారితీశాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.
వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో అత్యధికులు నేపాల్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు.
ఈ విపత్తుపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఊహకందనిదిగా, హృదయ విదారకంగా ఉందని పేర్కొన్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా నష్టాన్ని అంచనా వేయడం సవాలుగా మారిందని తెలిపారు.
మరోవైపు శాటిలైట్ చిత్రాలు, భూకంప డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. లాంగ్‌టాంగ్ లిరుంగ్ ఉత్తర భాగంలో భారీగా మంచు, రాళ్లు విరిగిపడటమే వరదలకు ప్రధాన కారణమని నిర్ధారించారు.
హిమానీనదం కూలిన సమయంలో భూకంప లేఖినిపై 5.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించారు.
హిమాలయాల్లో ఇలాంటి విపత్తులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో అస్థిరంగా ఉన్న మంచు, రాళ్ల కారణంగా మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

A Chinese photographer accidentally captured the catastrophic avalanche on Mount Lamtang in Nepal during a drone shoot.

[📹 HeyMu. Travel] pic.twitter.com/rgWylkezSC
— Massimo (@Rainmaker1973) August 28, 2026