మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / KGHలో మందుల కొరతపై రోగి ఆవేదన.. బయట మందులు కొనాల్సిందేనా?
KGHలో మందుల కొరతపై రోగి ఆవేదన.. బయట మందులు కొనాల్సిందేనా?
AP TODAY
AP TODAY

5 days ago

KGHలో మందుల కొరతపై రోగి ఆవేదన.. బయట మందులు కొనాల్సిందేనా?

స్కిన్ డిసీజ్‌తో చికిత్స కోసం వెళ్లిన రోగికి అవసరమైన మందులు అందలేదని ఆరోపణ

విశాఖపట్నం, సెప్టెంబర్ 10 (AP Today): విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో మందుల లభ్యతపై ఓ రోగి ఆవేదన వ్యక్తం చేశారు. చర్మ సంబంధిత సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తనకు గంటకు పైగా సమయం వేచి చూసిన తర్వాత కూడా అవసరమైన ప్రధాన మందులు అందలేదని ఆయన తెలిపారు.

రోగి తెలిపిన వివరాల ప్రకారం.. స్కిన్ డిసీజ్‌తో KGHకి వెళ్లగా, చాలాసేపు వేచి చూసిన అనంతరం వైద్యులు సాధారణ మందులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. తనకు అవసరమైన ప్రధాన మందులు అందుబాటులో లేవని, బయట నుంచి కొన్ని షాంపూలు కొనుగోలు చేసుకోవాలని సూచించారని తెలిపారు.

వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న ప్రధాన ఆయింట్‌మెంట్ కూడా ఆసుపత్రిలో అందుబాటులో లేదని చెప్పడంతో బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని రోగి ఆవేదన వ్యక్తం చేశారు.

పేద రోగులకు ఇబ్బందులు తప్పవా?

KGH వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని, అవసరమైన మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేకపోతే బయట కొనుగోలు చేయాల్సి రావడం ఆర్థికంగా భారంగా మారుతుందని రోగి పేర్కొన్నారు.

ఇప్పటికే వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, ఆ తర్వాత కూడా అవసరమైన మందులు అందకపోతే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు స్పందించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగి కోరుతున్నారు. ముఖ్యంగా పేదలకు ఉచితంగా అందాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయా? మందుల కొరతకు కారణం ఏమిటి? అనే అంశాలపై ఆసుపత్రి అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే, ఈ ఘటనకు సంబంధించి KGH అధికారుల అధికారిక వివరణ అందాల్సి ఉంది. అధికారుల స్పందన వెలువడితే పూర్తి వివరాలతో తదుపరి కథనాన్ని అందిస్తాం.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement