మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / మంత్రి కొండ సురేఖ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రి కొండ సురేఖ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
AP TODAY
AP TODAY

August 21, 2026

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ పర్యటన నుంచే ముఖ్య నేతలకు ఆయన గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పరకాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తద్వారా రేవూరి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేస్తూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే, ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేలా.. ఆ మరుసటి రోజే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలో సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
సీఎం పర్యటనకు స్థానిక మంత్రిగా ఉన్న కొండా సురేఖ గైర్హాజరు కావడం, ఆ వెంటనే ఆమె కుమార్తె ఈ వ్యాఖ్యలు చేయడం ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలపై బుధవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్.. అక్కడే కొందరు ముఖ్య నేతల వద్ద తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సీనియర్ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి, ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారని సమాచారం.
సీఎం ఆదేశాల మేరకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే, "కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలిని అవుతాను?" అని మంత్రి సురేఖ గురువారం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ స్పందిస్తూ.. "సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎవరికి వారు పోటీ చేస్తామని ప్రకటించుకోవడం సరికాదు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు. మంత్రి సురేఖ వివరణను పరిశీలించాక తదుపరి చర్యలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది" అని స్పష్టం చేశారు.  

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement