మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / కంటెంటే కింగ్... స్టార్‌డమ్ కాదు ‘పెద్ది’ నుంచి ‘ఇరుముడి’ దాకా కొత్త పాఠం నేర్పించిన ఆడియన్స్
కంటెంటే కింగ్... స్టార్‌డమ్ కాదు ‘పెద్ది’ నుంచి ‘ఇరుముడి’ దాకా కొత్త పాఠం నేర్పించిన ఆడియన్స్
AP TODAY
AP TODAY

August 24, 2026

చలనచిత్ర పరిశ్రమకు 2026 సెకండాఫ్ సరికొత్త ఊపునిచ్చింది. కథలో కొత్తదనం, బలం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారని తాజా విజయాలు నిరూపిస్తున్నాయి. ‘పెద్ది’ మొదలుకొని ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘కొరియన్ కనకరాజు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ల మీదుగా తాజా చిత్రం ‘ఇరుముడి’ వరకు వరుస హిట్లు టాలీవుడ్‌ను విజయపథంలో నడిపిస్తున్నాయి. స్టార్ ఇమేజ్‌తో పనిలేకుండా చిన్న, మిడ్-రేంజ్ సినిమాలకు సైతం బుక్‌మైషోలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్‌ఫుల్ షోలు నమోదు కావడం ఇండస్ట్రీకి శుభపరిణామంగా చెప్పొచ్చు. ఈ జోరు చూస్తుంటే 2026 టాలీవుడ్‌కు చిరస్మరణీయ బ్లాక్‌బస్టర్ సంవత్సరంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement