తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చుట్టూ రాజకీయ, వ్యక్తిగత వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో విజయ్‌తో విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన కుమారుడి వైఖరిని ఆయన సమర్థించారు.
మహిళల గౌరవం, రాజకీయ మర్యాదల విషయంలో విజయ్ తీసుకున్న నిర్ణయాలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని, విజయ్ పట్టుదల, విజయాన్ని చూసి తాను గర్విస్తున్నానని స్పష్టం చేశారు.
తండ్రి నుంచి వచ్చిన ఈ బహిరంగ మద్దతుతో విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.