మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని కారులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
AP TODAY
AP TODAY

August 31, 2026

విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులో కారు లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యారు.

గాండ్రిగుండం పరిధిలోని సత్తారువు జంక్షన్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

జాతీయ రహదారి-16 సర్వీస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రాలేకపోయారు. వాహనంలోనే చిక్కుకుపోయిన ఆయన మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి చేరుకునే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

ఆనందపురం ఎస్ఐ శివ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. ప్రమాద సమయంలో కారు నంబర్ ప్లేట్ ఊడిపోయి లారీకి అతుక్కుపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement